PMSYM Pradan Mantri Shram Yogi Maan Dhan Yojana Scheme - ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం
PMSYM - ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం అంటే ఏమిటి ?
- అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ (pmsym) పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
- అసంఘటిత కార్మికునికి 60 ఏళ్లు నిండిన తర్వాత జీవితకాలం ప్రతి నెల రూ.3వేల పెన్షన్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ ద్వారా అందుతుంది. మరణిస్తే నామినీకి పింఛన్ మొత్తంలో 50 శాతం లభిస్తుంది. అతను 60 ఏళ్ల లోపు మృతి చెందితే కట్టిన ప్రీమియాన్ని వడ్డీతో కలిపి నామినికి చెల్లిస్తారు.
- ఈ పథకంలో చేరే కార్మికులు ఎంతమేర ప్రీమియం చెల్లిస్తే దానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
- 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెల రూ.3వేల పెన్షన్ వస్తుంది.
- ఈ పథకంలో కార్మికుడు తన వాటా కింద ప్రీమియం చెల్లించాలి.
- చాలామందికి దీనిపై అంతగా అవగాహన లేదు.
- నెలకు రూ.15వేలు ఆదాయం వచ్చే 18 నుంచి 40 వయస్సు గల అసంఘటిత కార్మికులు ఈ స్కీంలో చేరవచ్చు. వీరికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేలు వస్తాయి.
pmsym Eligibility - ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం ఎవరు అర్హులు ?
18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ స్కీంలో చేరవచ్చు. 60 ఏళ్ల వరకు దీనిని చెల్లించాలి. అంటే 20 నుంచి 42 ఏళ్లు చెల్లించాలి. నెల ఆదాయం రూ.15వేల లోపు ఉన్నవారు దీనికి అర్హులు.- ఇతర పెన్షన్ పథకాల్లో సభ్యులు కానివారు,
- ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనివారు,
- పనివాళ్లు,
- భవన నిర్మాణ కార్మికులు,
- ఇళ్లల్లో పనిచేసేవారు,
- వ్యవసాయ కూలీలు,
- చెత్త ఎరుకుని విక్రయించేవారు,
- ఆటో,
- రిక్షా,
- ప్రయివేటు డ్రైవర్లు,
- బీడీ,
- చేనేత,
- రజక,
- కుమ్మరి,
- దర్జీ వంటి చేతి వృత్తుల వారు అర్హులు.
pmsym ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకంలో ఎలా చేరాలి ?
How to apply pmsym pradhan mantri shram yogi maan dhan pm sym scheme
- అర్హత కలిగిన చందాదారులు కామన్ సర్వీస్ సెంటర్స్(CSC)లకు వెళ్లి వివరాలను నమోదు చేసుకోవచ్చు.
- ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించేందుకు పొదుపు బ్యాంకు ఖాతా, జన్‌ధన్ ఖాతా, ఆధార్ కార్డ్ ఉండాలి.
- దేశ వ్యాప్తంగా 3.13 లక్షల సీఎస్‌సీ సెంటర్లు ఉండగా వీటిలో ఎక్కడైనా ఈ పథకంలో చేరే అవకాశం ఉంది.
pmsym Scheme Good or Bad - ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం ఎలా ఉంటుంది ?
- ఈ స్కీమ్‌లో చేరిన చందాదారుడు 50 శాతం ప్రీమియం చెల్లిస్తే.. అంతేస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది.
- ఒకవేళ ఈ పథకంలో చేరిన చందారుడు చనిపోతే.. అతని నామినీ(భార్య/భర్త) ఈ పథకాన్ని కొనసాగించవచ్చు.
- చందాదారుడికి 60 ఏళ్లు దాటాక నెలకు రూ. 3 వేలు చొప్పున పెన్షన్ లభిస్తుంది.
- అయితే, మొదటి నెల చెల్లింపు జరిపిన తరువాత వారికి రశీదు ఇస్తారు. దాంతోపాటు.. ప్రత్యేక ఐడీ నంబర్లు ఉన్న కార్డులను కూడా అందిస్తారు.
pmsym apply online required details - ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం వివరాలు ఎలా ఇవ్వాలి ?
- అర్హులైన వారు తమ ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్, సెల్ ఫోన్ నెంబర్, ఇవ్వాలి.
- వయసు ఆధారంగా నెలకు ప్రీమియం రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
- కార్మికుడు చెల్లించిన దానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
- కార్మికుడు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి.
- తొలి నెల ప్రీమియం నగదు రూపంలో మిగిలిన ప్రీమియంలు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా పథకం పేరుతో జమ అవుతాయి.
- ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్, పాస్‌బుక్‌లు ఇవ్వవలసి ఉంటుంది.
- వయస్సు, ఆదాయానికి సంబంధించిన డిక్లరేషన్ తప్పుగా ఇస్తే పెనాల్టి ఉండే అవకాశాలు ఉంటాయి.
- ఈ పెన్షన్ స్కీం ఫండ్ మేనేజర్, సబ్‌స్బ్రైబర్‌కు పేమెంట్ సర్వీస్ప్రొవైడర్ ఎల్ఐసీ
pmsym exit process - ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం నుండి మధ్యలో బయటకు ఎలా రావాలి ?
- pmsym స్కీంలో చేరిన వారు ఏదైనా ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోకి వెళ్తే, అందులో మూడేళ్ల పాటు ఉంటే.. మీ అకౌంట్ అలాగే కొనసాగుతుంది. కానీ ఆ కాలానికి ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఆగిపోతుంది.
- ఒకవేళ సబ్‌స్క్రైబర్ కనుక మొత్తం అమౌంట్ చెల్లించుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ప్రకారం 60 ఏళ్లు వచ్చాక మీ అమౌంట్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ సమయంలోని బ్యాంకు ఇంట్రెస్ట్‌తో కలిపి తీసుకోవచ్చు.
- అయిదేళ్ల తర్వాత ఈ స్కీం వద్దనుకుంటే సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటుతో కలిపి ఇస్తారు. మరో విషయం గుర్తుంచుకోండి.
- పెన్షన్ ప్రారంభానికి ముందు, పదేళ్ల కంట్రిబ్యూషన్ తర్వాత సబ్‌స్క్రైబర్ ఈ స్కీం నుంచి వెళ్లిపోవాలనుకుంటే కేవలం మీ కంట్రిబ్యూషన్ మాత్రమే ఇస్తారు. కానీ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ రాదు.
pmsym amount - ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం ఏ వయసులో ఎంత పేమెంట్ చేయాలి ?
- 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఈ పెన్షన్ స్కీంలో చేరవచ్చు. 60 ఏళ్ల వయస్సు వరకు చెల్లించాలి.
- తక్కువ వయస్సులో చేరితే తక్కువ మొత్తం నుంచి ప్రారంభమవుతుంది. కార్మికుడి కంట్రిబ్యూషన్ ఎంతగా ఉంటే గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంటుంది.
- ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే కార్మికుడి కంట్రిబ్యూషన్ రూ.55 అవుతుంది. ప్రభుత్వం అంతేమొత్తం ఇస్తుంది. మొత్తం రూ.110 అవుతుంది.
వయస్సు | కార్మికుడి కంట్రిబ్యూషన్ | మొత్తం (ప్రభుత్వం కలిపి) |
18 | 55 | 110 |
19 | 58 | 116 |
20 | 61 | 122 |
21 | 64 | 128 |
22 | 68 | 136 |
23 | 72 | 144 |
24 | 76 | 152 |
25 | 80 | 160 |
26 | 85 | 170 |
27 | 90 | 180 |
28 | 95 | 190 |
29 | 100 | 200 |
30 | 105 | 210 |
31 | 110 | 220 |
32 | 120 | 240 |
33 | 130 | 260 |
34 | 140 | 280 |
35 | 150 | 300 |
36 | 160 | 320 |
37 | 170 | 340 |
38 | 180 | 360 |
39 | 190 | 380 |
40 | 200 | 400 |